ఉతతరధర కవతవల పరతయ చతనయ – శలప వశలషణ
Abstract
సాహిత్యం అనేది వస్తువు (Content) మరియు శిల్పం (Form/Technique) అనే రెండు అంశాల రసాయనిక సమ్మేళనం. 2011-2020 దశాబ్దంలో వెలువడిన ఉత్తరాంధ్ర కవిత్వం కేవలం ప్రాంతీయ వెనుకబాటుతనాన్ని, ఆవేదనను వినిపించే నినాద ప్రాయమైన రచనలుగా మిగిలిపోలేదు. ఇక్కడి కవులు తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని, మాండలిక సౌందర్యాన్ని, సామాజిక స్పృహను అత్యున్నత స్థాయి కళాత్మక విలువలతో జోడించి, వచన కవిత్వ ప్రక్రియలో నూతన ప్రమాణాలను నెలకొల్పారు. ఈ పరిశోధనా పత్రం ఉత్తరాంధ్ర కవిత్వంలోని ఐదు ప్రధాన శిల్ప రీతులైన శీర్షిక, ఎత్తుగడ, భాష (మాండలికం), ప్రతీక, మరియు ముగింపులను విశ్లేషిస్తుంది. వస్తువుకు తగిన రూపం ఎలా అమరింది? ఆవేశాన్ని ఆలోచనగా మార్చడంలో శిల్పం ఎలా ఉపకరించింది? అనే అంశాలను ఎంపిక చేసిన కవితల ద్వారా ఈ పత్రం చర్చిస్తుంది.
Fields of Study & Subjects
Poetry Analysis and Criticism
South Asian Studies and Diaspora
Literary Analysis and Cultural Studies
Publication details
- Journal / source
- International Journal For Multidisciplinary Research
- Volume
- 8
- Issue
- 1
- Publication date
- 12 February 2026
- Language
- TE