తలగణ పట కథనకళరపల ఔననతయ: ససతకవకస

Read full text
Authors: డా. లక్ష్మయ్య
Cited by: 0

Abstract

పరిశోధన కళలు సమాజం సమిష్టి జ్ఞాపకాలు, సంస్కృతి భాండాగారాలు. తెలంగాణలో కళలు త్రిముఖ పార్శ్వాలలో పని చేస్తున్నది. కుల సంస్మృతి పరిధిలో - సంప్రదాయ రూపాలుగానూ, సామాజిక పరిధిలో - వినోద రూపాలు గానూ, ప్రజా చైతన్య పరిధిలో - అనువర్తితాలుగానూ సాగుతున్నవి. కళలు సమిష్టిగా తెలంగాణ సమాజాన్ని సాంస్కృతిక సైన్యంగా మలిచి మార్చింగ్ చేయస్తు న్నవి, చేయిస్తాయి కూడానూ. ఇలాంటి కళా కదలికల్లో పటం కథన ప్రదర్శన కళారూపాలు కూడ నిలిచాయి. ఇంతటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న ఈ కళా రూపాల ఔ న్నత్యం, సాంస్కృతిక వికాసాన్ని చర్చించడమే. ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం. సామాజిక, సాంస్కృతిక దృక్పథంతో సంస్కృతిలోని మౌలికాంశాల లో ఆశ్రిత కులాల పురోగతిని విశ్లేషణాత్మకంగా చర్చించడమే ఇందులో చేసే పరిశోధన ప్రధానాంశాలు. కుల పరిధిలో సాగుతున్న సాంస్కృతిక వికాసాన్ని విశ్లేషించడం పరిశోధనలోని అంశం. కథనం పుట్టుక, వృత్తిగ్రామకులు -ప్రదర్శన తీరు, కళ ల - ఔన్నత్యం, సాంస్కృతిక వికాసంలో వీని పాత్ర, ప్రతిపాదిత అంశాలతో వ్యాస రచన ప్రణాళిక. ఈ అంశ పరిధిలో పూర్వ పరిశోధనలు చాలానే ఉన్నవి. డా. పులికొండ సుబ్బాచారి : కుల పురణాలు - ఆశ్రిత కులవ్యవస్థ గ్రంథం చారిత్రక విశ్లేషణను పొందు పరిచింది. డా. గడ్డం వెంకన్న : పటం కథలు – కథకులు గ్రంథం ప్రత్యేకించి, పటం కథల ప్రదర్శన తీరులను విశ్లేషించింది. డా. మామిడి హరికృష్ణ : ఆశ్రిత వర్గాల కథన కళారూపాలు - వ్యాసం పుట్టుక క్రమ వికాసం, సమకాలీన సమాజ చేయూత లాంటి అంశాలను విశ్లేషిస్తుంది. తెలంగాణ జానపద కళా సౌరభాలు, కళా తెలంగాణం, బిక్షుక కుంట్లు - ప్రదర్శన విధానం (వ్యాసం) లాంటివి విషయ సేకరణకు దోహద పడినవి.

Fields of Study & Subjects

Cultural and Mythological Studies Cultural History and Identity Formation Arts and Performance Studies

Publication details

Journal / source
ఔచిత్యమ్
Publication date
1 January 2026
Language
TE